తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ను ఎన్నారై బీఆర్‌ఎస్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల హైదరాబాద్‌లోని యశోద దవాఖానలో పరామర్శించారు. దవాఖానలో చంద్రశేఖర్‌రావును పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహేష్ బిగాల మాట్లాడుతూ కేసీఆర్ వేగవంతంగా కోలుకుంటున్నారని తెలిపారు. అతి త్వరలో ప్రజా క్షేత్రంలోకి రావాలని ఎన్నారైల తరఫున ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు.