మహేష్ బాబు హీరో గా నటిస్తున్న కొత్త సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పూజా హెగ్డే, శ్రీలీల నాయికలుగా నటిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దివంగత సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ను అభిమానుల చేతుల మీదుగా విడుదల చేశారు. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు. పాట బీజీఎం ఉన్న ఫైట్‌తో మొదలైన గ్లింప్స్ ఏంది అట్టా జూస్తున్నావ్, బీడీ త్రీడీలో కనబడుతుందా? అంటూ మహేష్ చెప్పిన మాస్ డైలాగ్‌తో పూర్తయింది. మిర్చి యార్డ్ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తున్నది. సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఎడిటర్ గా జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి, కళా దర్శకునిగా ఎ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రాహకుడు గా పి.ఎస్.వినోద్ వ్యవహరిస్తున్నారు. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న గుంటూరు కారం చిత్రం సంక్రాంతి కానుకగా 2024, జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.


