Namaste NRI

దావోస్ వేదికగా హైదరాబాద్‌కు…భారీ పెట్టుబడులతో రానున్న బడా సంస్థలు

స్విట్జర్‌లాండ్‌లోని దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ( డబ్ల్యూఈఎఫ్)లో పెట్టుబడుల ఆకర్షణలో హైదరాబాద్ నగరం ప్రత్యేకతను చాటుకుంది. తెలంగాణ ప్రభుత్వ ఒప్పందాలు నగర ప్రతిష్ఠను మరింత పెంచుకున్నాయి. భారీ పెట్టుబడులతో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు, భాగ్యనగరంలో నెలకొల్పనున్న కార్యాలయాలు, ఆర్థిక కార్యకలాపాలను విస్తతం చేయడంతోపాటు ఉపాధి, ఉద్యోగావకాశాలను భారీగా పెంచనున్నాయి. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనంతో పాటు అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన తోడ్పాటు అందించేందుకు ఆసక్తి చూపాయి. నగర ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు దోహదపడే అంశాలతోపాటు మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆరఆరఆర్ పనులూ వేగవంతం అవుతాయని ప్రభుత్వం పేర్కొంది. స్కిల్ యూనివర్సిటీతో కలిసి పనిచేసేందుకు విదేశాలు ముందుకు వచ్చాయి. ప్రధానంగా కత్రిమ మేధకు సంబంధించి పరిశోధన కేంద్రాల ఏర్పాటుపై ఆసక్తి చూపాయి.

ఏయే సంస్థలు రానున్నాయంటే :


1.విమానయాన రంగంలో మెయిన్‌టెనెన్స్ అండ్ రిపేర్ యూనిట్ ఏర్పాటుకు సర్గాడ్ సంస్థ ముందుకు వచ్చింది. మూడేళ్లలో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.

2.ప్రముఖ సౌందర్య సాధనాల సంస్థ లోరియల్ మొదటి అంతర్జాతీయ ఏఐ బ్యూటీ టెక్ హబ్‌ను స్థాపించనుంది. ఏఐ ఆధారంగా చర్మం, సౌందర్య సాధనాలపై పరిశోధనలు చేస్తుంది. సుమారు 2 వేల మంది ఏఐ నిపుణులు, టెక్ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా.


3.కాలిఫోర్నియా బ్లేజ్ సంస్థ నగరంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ( జీసీసీ) కేంద్రాన్ని విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్, చిప్ డిజైన్ రంగాలకు దోహదపడనుంది.


4.దిగ్గజ సంస్థ యూనిలీవర్ తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటుతో అంతర్జాతీయ కార్యకలాపాల కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.


5.పియర్సన్ సంస్థ కాలేజీ విద్యార్థులకు, ఉద్యోగులకు ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్‌లో కోర్సులందిస్తుంది.


6.నివిడియా క్లౌడ్ మౌలిక సదుపాయాల కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.

7.క్రీడా మైదానాలను ప్రపంచస్థాయిలో అభివద్ధి చేయడంతోపాటు ఏఐ డేటా సెంటర్లు, సెమీ కండక్టర్, ఎలక్ట్రిక్ వాహన రంగాల్లో కొత్త పరిశ్రమల పట్ల టాటా సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను స్వచ్ఛమైన ఇంధనంతో తీర్చడానికి మార్గం సుగమం చేసేలా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ప్రాజెక్ట్‌లపై చర్చలు జరిగాయి.


8.నెదర్లాండ్స్‌కు చెందిన యూపీసీ వోల్ట్ సంయుక్తంగా ప్యూచర్ సిటీలో రూ.5,000 కోట్లతో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ రెడీ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చాయి.

    Social Share Spread Message

    Latest News

    Our Advertisers

    తాజా వార్తా చిత్రాలు

    NRI Events