మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డినే గెలిపించాలని అమెరికాలోని కాలిఫోర్నియా నగర కమిషనర్, భారత సంతతి వ్యక్తి రఘు రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిస్తే మునుగోడు అభివృద్ధి బాధ్యతను మంత్రి కేటీఆర్ తీసుకుంటారని, కాబట్టి కేటీఆర్, జిల్లా ఇన్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జగదీశ్‌రెడ్డిల చేతులకు మరింత బలం చేకూర్చేలా అధికార పార్టీ అభ్యర్థికి ఓటేయాలని కోరారు. ప్రతిపక్షాలతో పోల్చి చూస్తే అధికార టీఆర్‌ఎస్ పార్టీ మాత్రమే మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిపట్ల నిబద్ధతతో ఉన్నదని, కాబట్టి స్థానిక ఓటర్లు టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలువడం తెలివైన నిర్ణయమని ఆయన సూచించారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వాలని, మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డిల ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో చూడాలన్నారు.














