కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం క. నయన్‌సారిక, తన్వీరామ్ కథానాయికలు. పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సుజీత్, సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్ మెంట్ పతాకంపై చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సినిమా మలయాళ థియేట్రికల్ హక్కులను అగ్ర హీరో దుల్కర్ సల్మాన్ సొంతం చేసుకున్నారు.

ఇటీవల విడుదలైన టీజర్ చూసిన దుల్కర్ సల్మాన్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యారని, తమ సంస్థ వేఫరర్ ఫిలింస్ ద్వారా రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారని మేకర్స్ తెలిపారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ కథాంశమిదని, ఆద్యంతం ఊహించని మలుపులతో సాగుతుందని దర్శకులు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డానియేల్, సంగీతం: సామ్ సీఎస్, దర్శకత్వం: సుజీత్, సందీప్.
