మమ్ముట్టి నటిస్తోన్న తాజా చిత్రం టర్బో. టర్బో చిత్రాన్ని వైశాక్ ఫిల్మ్ బ్యానర్‌పై మిధున్ మాన్యుయెల్ థామస్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి మమ్ముట్టి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. తాజాగా విడుదల చేసిన టర్బో ట్రైలర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 3.25 మిలియన్ల రియల్ టైం వ్యూస్‌తో,ఎక్కువ మంది వీక్షించిన మమ్ముట్టి ట్రైలర్‌గా అరుదైన ఫీట్ నమోదు చేసింది. ట్రైలర్‌లో వచ్చే స్టన్నింగ్ యాక్షన్ విజువల్స్ అభిమానులు, మూవీ లవర్స్‌కు విజువల్ ట్రీట్ అందించడం ఖాయమని చెప్పకనే చెబుతున్నాయి.
ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మమ్ముట్టి బ్లాక్ షర్ట్, తెలుపు లుంగీలో షార్ట్ హెయిర్, కోరమీసాలతో ఊరమాస్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ అమాంతం పెంచేస్తున్నాడు. టర్బో చిత్రాన్ని మే 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు తెలియజే రు. ఇటీవలే మేకర్స్ షేర్ చేసిన పోస్టర్‌లో మమ్ముట్టి జీపుపై రాజసం ఉట్టిపడేలా కనిపిస్తున్నాడు. మమ్ముట్టి నుంచి చాలా రోజుల తర్వాత పక్కా మాస్ ఎంటర్‌టైనర్ వస్తుండటంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు అభిమానులు.