Namaste NRI

సోదరా మూవీ సాంగ్ లాంచ్ చేసిన మంచు మనోజ్

సంపూర్ణేష్‌బాబు, సంజోష్‌, ప్రాచీబంసాల్‌, ఆరతిగుప్తా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సోదరా. మన్‌మోహన్‌ మేనంపల్లి దర్శకుడు. ఈ సినిమాలోని అన్నంటే దోస్తే సోదరా అనే పాటను హీరో మంచు మనోజ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సంపూర్ణేష్‌బాబు నవ్వు ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్ఛంగా ఉంటుందని, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ కరెంట్‌ తీగ సినిమా చేస్తున్నప్పటి నుంచి మంచు మనోజ్‌తో అనుబంధం కొనసాగుతున్నది. ఆయన్ని నా సొంత అన్నలా భావిస్తా అని చెప్పారు. సుద్దాల అశోక్‌తేజ రాసిన ఈ గీతం అన్నాదమ్ముల అనుబంధానికి అద్దం పడుతుందని దర్శకుడు మన్‌మోహన్‌ మేనంపల్లి తెలిపారు.

నిర్మాత చంద్ర చాగంల మాట్లాడుతూ  ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ కి వచ్చిన మంచు మనోజ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ సాంగ్ పెద్ద సక్సెస్ అవుతుందని అలాగే సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.ఈవెంట్లో మూవీ టీం హీరోలు సంపూర్ణేష్ బాబు, సంజోష్, దర్శకుడు మన్ మోహన్ మేనంపల్లి, ప్రొడ్యూసర్ చంద్ర చగంలా, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, మాధవ్ గారు మరియు ప్రొడ్యూసర్ శివన్ కుమార్ గారు ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జాన్‌, సంగీతం: సునీల్‌కశ్యప్‌, నిర్మాత: చంద్ర చగంలా, కథ-దర్శకత్వం: మన్‌మోహన్‌ మేనంపల్లి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events