ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని సినీ హీరో మంచు మనోజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రి జగన్ గారిని కలవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని మనోజ్ ఈ సందర్భంగా తెలిపాడు. రానున్న సంవత్సరాల్లో చేయబోతున్న పనులు గురించి ముఖ్యమంత్రి నుంచి తెలుసుకున్నానని చెప్పాడు. సార్ మీరు అనుకున్న అన్ని పనులను నిర్వఘ్నంగా పూర్తి చేసే శక్తిని ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నా అని మనోజ్ ట్వీట్ చేశాడు. జగన్ పాలనకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు మంచు మనోజ్ తెలిపారు. కాగా మంచు మనోజ్ ముఖ్యమంత్రి జగన్‌ను కలవడానికి గల కారణాలు తెలియలేదు.