Skip to main content

Namaste NRI

సీఎం వైఎస్ జగన్ ను కలిసిన మంచు మనోజ్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని సినీ హీరో మంచు మనోజ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.  దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రి జగన్‌ గారిని కలవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని మనోజ్‌  ఈ సందర్భంగా తెలిపాడు. రానున్న సంవత్సరాల్లో చేయబోతున్న పనులు గురించి ముఖ్యమంత్రి నుంచి తెలుసుకున్నానని చెప్పాడు. సార్‌ మీరు అనుకున్న అన్ని పనులను నిర్వఘ్నంగా పూర్తి చేసే శక్తిని ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నా అని మనోజ్‌ ట్వీట్‌ చేశాడు. జగన్‌ పాలనకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు మంచు మనోజ్‌ తెలిపారు.  కాగా మంచు మనోజ్‌ ముఖ్యమంత్రి జగన్‌ను కలవడానికి గల కారణాలు తెలియలేదు.

Social Share Spread Message

Latest News