ఇటీవల మలయాళంలో విడుదలైన మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం సంచలన విజయం సాధించింది. కొడైకే నాల్‌లోని గుణ గుహ నేపథ్యంలో సర్వైవల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ఏప్రిల్ 6న తెలుగులో విడుదల చేస్తున్నది. యథార్థ సంఘట నల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2006లో ఎర్నాకులం మంజుమ్మెల్ అనే పట్ణణానికి చెందిన యువకులు కొడైకెనాల్ విహార యాత్రకు వెళతారు. అక్కడ గుణ కేవ్‌లో మిత్రబృందంలోని ఓ యువకుడు చిక్కుకుపోతాడు. అతన్ని రక్షించడానికి చేసిన ప్రయత్నాలు ఏమిటన్నదే చిత్ర కథాంశం. స్నేహం, అడ్వెం చర్ నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతంది. తెలుగు వెర్షన్‌ను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నామని మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: ఫైజు ఖలీద్, సంగీతం: సుశీన్ శ్యామ్, రచన-దర్శకత్వం: చిదంబరం.