ప్రమోద్‌దేవా, రణధీర్, కీర్తన, స్వర్గం ముస్కాన్, రాజేందర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం మర్రిచెట్టు కింద మనోళ్లు. నరేష్‌వర్మ ముద్దం దర్శకుడు. శ్రీ నారసింహ చిత్రాలయ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు బాబూమోహన్ క్లాప్ కొట్టగా, నటుడు నాగమహేష్ కెమెరా స్విచాన్ చేశారు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, రాజీవ్ కనకాల, ఫిల్మ్‌ఛాంబర్ అధ్యక్షులు దామోదరప్రసాద్, నిర్మాత సి.కల్యాణ్, రష్మి ఠాగూర్ అతిథులుగా పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. మర్రిచెట్టు కింద మనోళ్లు అనే టైటిల్ వల్ల ప్రారంభానికి ముందే సినిమా జనాల్లోకి వెళ్లిపోయిందని దర్శకుడు చెప్పారు. చిత్రంలో నటించడం పట్ల పాత్రధారులంతా ఆనందం వెలిబుచ్చారు. ఇంకా సహ నిర్మాతలు ఆకుల రిషేంద్ర నరసయ్య, బీసు చందర్‌గౌడ్ కూడా మాట్లాడారు.