సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో విదేశీ మద్యం, గంజాయి కలకలం రేగింది. పుట్టిన రోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్‌లో మంగళవారం రాత్రి ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ వేడుకలు నిర్వహించారు. అనుమతి లేకుండా నిర్వహించిన వేడుకలో కుటుంబ సభ్యులతో పాటు సినీ, టీవీ రంగానికి చెందిన పలువురు సెలబ్రిటీలు సుమారు 50 మంది పాల్గొన్నారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఎస్‌ఓటీ పోలీసులు అకస్మాత్తుగా దాడి చేశారు. మొత్తం 48 మంది పట్టుబడగా అందరికీ గంజాయి టెస్టులు నిర్వహించారు. ఇందులో 9 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది . గంజాయి సేవించిన వారిలో ఒక ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అలాగే అనుమతి లేకుండా బర్త్‌డే పార్టీ నిర్వహించినందుకు ఫోక్ సింగర్ మంగ్లీ, త్రిపుర రిసార్ట్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. విదేశీ మద్యం , అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు డీజే వ్యవస్థను సీజ్ చేశారు. ఈ బర్త్‌డే పార్టీలోఒక టివి నటి, రచయితపాల్గొన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు అనుమతి లేకుండా పార్టీ నిర్వహణ, న్యూసెన్స్ కేసులు నమోదు చేశారు.
దర్యాప్తు జరుపుతున్నారు.
