రాజ్‌తరుణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం భలే ఉన్నాడే. జే. శివసాయివర్ధన్ దర్శకుడు. ఎన్.వి.కిరణ్ కుమార్ నిర్మాత. దర్శకుడు మారుతి ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు మారుతి టీజర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ రాజ్‌తరుణ్‌తో మంచి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. దర్శకుడు సాయికి ఈ పాయింట్ చెబితే తను బాగా డిజైన్ చేసుకొని తీసుకొ చ్చాడు. ఇది కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్. మన మధ్యలో జరిగే కథలా ఉంటుంది. శేఖర్‌చంద్ర మంచి పాటలి చ్చారు అన్నారు.
మారుతితో సినిమా చేయాలనే కల ఈ ప్రాజెక్ట్‌తో నెరవేరిందని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని హీరో రాజ్‌తరుణ్ తెలిపారు. దర్శకుడిగా తనకిది మొదటి చిత్రమని, ఆద్యంతం నవ్విస్తుందని జె.శివసాయివర్థన్ చెప్పారు. ఈ సినిమాలో కామెడీ కొత్త పంథాలో ఉంటుందని, పాటలు బాగా కుదిరాయని, సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నగేష్ బానెల్లా, సమర్పణ: మారుతి టీమ్, ప్రొడక్షన్ డిజైనర్: శివకుమార్ మచ్చ, దర్శకత్వం: జె.శివసాయివర్ధన్.