గాజా పోరులో ఇజ్రాయెల్‌కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. భారీ స్థాయిలో ఆందోళన నిర్వహిస్తున్నారు. అమాయకులైన పాలస్తీనా మహిళలు, చిన్నారుల మరణాలకు బైడెన్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. యేల్, ఎంఐటీ, హార్వర్డ్, కొలంబియా తదితర విశ్వవిద్యాలయాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కొలంబియా విశ్వవిద్యాలయం తరగతి గదులను మూసివేసింది. మిగిలిన సెమిస్టర్ హైబ్రీడ్ పద్దతిని అనుస రించనుంది. కళాశాలల్లో పాలస్తీనాకు అనుకూలంగా ఆందోళన చేస్తున్న డజన్ల కొద్ది విద్యార్థులకు యేల్ పోలీసులు అరెస్టు చేశారు. యుద్దానికి వ్యతిరేకంగా చాలా కళాశాలల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. విశ్వ విద్యాలయాల రోజువారీ కార్యకలాపాలకు విద్యార్థులు ఆటంకం కలిగిస్తున్నారు. న్యూయార్క్ యూనివర్సి టీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పలువురు విద్యార్థులను అరెస్టు చేశారని తెలిసింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)