సందీప్‌కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మాయవన్. సీవీ కుమార్ దర్శకుడు. ఏకే ఎంటర్ టైన్‌మెంట్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఆకాంక్ష రంజన్‌కపూర్, మురళీశర్మ తదితరులు నటిస్తున్నారు. సైన్స్‌ఫిక్షన్ యాక్షన్ కథాంశంతో రూపొందిస్తున్నారు. సందీప్‌కిషన్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో సందీప్‌కిషన్ చేతిలో సూపర్ పవర్ వెపన్‌తో కనిపిస్తున్నారు. వైవిధ్యమైన కథతో రూపొందిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రమిదని, సందీప్‌కిషన్ పాత్ర సూపర్‌హీరో తరహాలో ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నీల్‌నితిన్ ముఖేష్ కీలక పాత్రను పోషిస్తున్నారు. భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ తిైల్లె, కవిన్‌రాజ్, సంగీతం: సంతోష్ నారాయణన్, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, దర్శకత్వం: సీవీ కుమార్.