భారత్ పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విదేశీ నేతలతో మోదీ భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో ఇరుదేశాల ప్రధాను లు కీలక నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి చికిత్స కోసం భారత్‌కు రావాలనుకునే వారికి ఇకపై ఈ-వీసా సదుపాయాన్ని కల్పించనున్నారు. దీనికోసం రంగ్‌పుర్‌లో కొత్తగా అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నట్లు మోదీ తెలిపారు. బంగ్లాదేశ్‌లోని వాయవ్య ప్రాంత ప్రజలు సులువుగా భారత్‌కు వచ్చి చికిత్స పొందే వీలుంటుందని చెప్పారు. బంగ్లాదేశ్‌తో సంబంధాలకే భారత్ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు.