టాలీవుడ్ నటి మీనాక్షి చౌదరి ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం.. తిరుమల విశిష్టతపై మీనాక్షి మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకున్న తర్వాత నా మనసుకు ఎంతో ప్రశాంతత, ఆనందం లభించింది. ఇక్కడ వీచే గాలిలో కూడా గోవిందా నామస్మరణ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. భక్తులకు అందిస్తున్న సేవలు చాలా అద్భుతంగా ఉన్నాయి అని అన్నారు.

దర్శనం నుంచి అన్నప్రసాదాల వరకు అన్ని ఏర్పాట్లు సమర్థంగా నిర్వహిస్తున్నారని ఆమె ప్రత్యేకంగా ప్రశంసించారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) మేనేజ్‌మెంట్ పనితీరును మెచ్చుకున్నారు. భక్తులకు అందించే ఉచిత అన్నప్రసాదాల గురించి కూడా ఆమె మాట్లాడారు. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహణ జరుగుతుండటాన్ని ఆమె అభినందించారు. ఇక్కడి సేవా భావం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు.















