Namaste NRI

ఫ్రాన్స్‌తో మెగా డీల్‌ ..రూ.3.25 ల‌క్ష‌ల కోట్ల‌తో

సుమారు 3.25 ల‌క్ష‌ల కోట్ల‌తో దాదాపు 114 ర‌ఫేల్ యుద్ధ విమానాల‌ను కొనుగోలు చేయ‌నున్నారు. భార‌తీయ వైమానిక ద‌ళ సామ‌ర్థ్యాన్ని పెంచే ఉద్దేశంలో భాగంగా ఫ్రాన్స్‌తో ఈ డీల్ జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయి. ర‌క్ష‌ణ శాఖ ఈ ఒప్పందానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఫ్రాన్స్ అధ్య‌క్షుడు మ‌రికొన్ని రోజుల్లో ఇండియాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆ స‌మ‌యంలో ర‌ఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు డీల్‌పై సంత‌కాలు చేయ‌నున్నారు. ఒక‌వేళ ఆ ఒప్పందానికి క్లియ‌రెన్స్ ద‌క్కితే, ఆయుధాల‌ను స‌మ‌కూర్చుకునే ప్ర‌క్రియ‌లోనే ఇది అతిపెద్ద డీల్ కానున్న‌ది. సుమారు వంద వ‌ర‌కు ర‌ఫేల్ యుద్ధ విమానాల‌ను ఇండియాలోనే త‌యారు చేసే రీతిలో డీల్ కుద‌ర‌నున్న‌ది. మేకిన్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా హైగ్రేడ్ ఫైట‌ర్ జెట్ టెక్నాల‌జీని ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌నున్నారు.


ఇండియా వ‌ద్ద ఇప్ప‌టికే 36 ర‌ఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. 2024 డిసెంబ‌ర్‌లో సీ వేరియంట్‌కు చెందిన చివ‌రి డెలివ‌రీని భార‌త్ అందుకున్న‌ది. ఆ త‌ర్వాత 26 నావెల్ ఏరియంట్స్ కోసం ఆర్డ‌ర్ ఇచ్చింది. ఎం వ‌ర్ష‌న్‌కు చెందిన ఆ యుద్ధ విమానాల‌ను నౌకాద‌ళం సుమారు 63 వేల కోట్లు ఖ‌ర్చుతో కొనేందుకు డీల్ కుదుర్చుకున్న విష‌యం తెలిసిందే. ఎంఆర్వో, మెయింటేనెన్స్‌, రిపేర్‌, ఓవ‌ర్‌హాల్ అగ్రిమెంట్‌లో భాగంగా నాలుగు ట్విన్‌ సీట్ ట్రైన‌ర్ విమానాల‌ను కూడా ఖ‌రీదు చేశారు. ఎం వ‌ర్ష‌న్‌కు చెందిన ర‌ఫేల్స్‌ను, ఐఎన్ఎస్ విక్రాంత్‌, ఐఎన్ఎస్ విక్ర‌మాదిత్య యుద్ధ నౌక‌ల‌పై మోహ‌రించ‌నున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events