Namaste NRI

క మూవీ టీమ్ ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

చిన్న సినిమాగా వ‌చ్చి బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ హిట్ అందుకుంది క చిత్రం. టాలీవుడ్ యువ న‌టుడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ సినిమాకు సుజీత్, సందీప్ ఇద్దరు దర్శకులు సంయుక్తంగా ద‌ర్శ‌క‌ త్వం వ‌హించ‌గా, కిర‌ణ్ అబ్బ‌వ‌రం సోంత బ్యాన‌ర్‌పై వ‌స్తున్న ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. న‌య‌న్ సారిక క‌థానాయిక‌గా న‌టించింది. దీపావళి కానుక‌గా అక్టోబ‌ర్ 31న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. తొలిరోజే రూ.6 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ చిత్రం వారం రోజుల్లో రూ.50 కోట్లకు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు చిత్ర‌బృందం తెలిపింది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం కు కూడా చాలా రోజుల త‌ర్వాత హిట్ ప‌డ‌డంతో మూవీని చూడ‌డానికి ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు క్యూ క‌డుతు న్నారు. ఇక ఇదే సినిమాను తాజాగా చూసిన మెగాస్టార్ చిరంజీవి మూవీ టీంని ఇంటికి ఇన్‌వైట్ చేసి కిరణ్ అబ్బ‌వ‌రంతో పాటు క మూవీ టీం అంద‌రిని ప్ర‌త్యేకంగా అభినందించాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events