ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం మెగాస్టార్ కు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం అందించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతు న్నారు. ఇప్పటికే పలువురు చిరంజీవిని స్వయంగా కలిసి అభినందనలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా అమెరికాలో అభిమానులు ప్రత్యేకమైన రీతిలో పండు గ చేసుకున్నారు. టైమ్ స్క్వేర్ పై చిరంజీవి సినీ ప్రయాణాన్ని ప్రదర్శించి, మెగాస్టార్ పై కుందవరపు శ్రీనివాస్ అనే వ్యక్తి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో అమెరికాలోని వివిధ తెలుగు సంఘాల సభ్యులు పాల్గొని, కేక్ కట్ చేశారు.