సాయికుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మెర్సి కిల్లింగ్. వెంకటరమణ ఎస్ దర్శకుడు. మాధవి తాలబత్తుల నిర్మాత. రామరాజు, సూర్య, ఆనంద్ చక్రపాణి తదితరులు నటిస్తు న్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను యువ హీరో ఆకాష్ పూరి విడుదల చేశారు. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం విజయం సాధించాలని ఆకాష్ పూరి ఆకాంక్షించారు.దర్శకుడు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. స్వేచ్ఛ అనే అనాథ బాలిక న్యాయ పోరాటం నేపథ్యంలో కథ నడుస్తుంది అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అమర్.జి, సంగీతం: ఎం.ఎల్.రాజా, దర్శకత్వం: వెంకటరమణ.ఎస్.