అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఎన్నారై కుటుంబాన్ని కాపాడుకుంటామన్నారు. తెలంగాణలో పల్లె ప్రగతి ద్వారా పల్లెలన్నీ బాగా అభివృద్ది చెందాయని స్పష్ట చేశారు. తెలంగాణ పల్లెలకు జాతీయ స్థాయిలో అత్యధిక అవార్డులు రావడమే ఇందుకు నిదర్శమని గుర్తు చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణగా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున ఏ సహాయం కావాలన్నా అందించే బాధ్యత నాది. తెలంగాణ ప్రభుత్వానికి మీ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. తన జన్మదిన వేడుకలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో మంత్రి కుటుంబ సభ్యులు, సినీ నిర్మాత దిల్ రాజు, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ శ్రేణులు, తానా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-05-at-10.24.56-1024x576.jpeg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/07/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-126-4-41.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/07/45af6911-9449-466d-a7e1-ba146800284b-124-4-41.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/07/638bff07-efd2-4cc9-8546-98039833db3c-132-4-41.jpg)