జూనియర్ ఎన్టీఆర్ ను తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిశారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ నివాసానికి మంత్రి పొంగులేటి కుటుంబసమేతంగా వెళ్లి కలిశారు. తన సొదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కుమారుడు లోహిత్ రెడ్డి వివాహానికి రావాలని ఎన్టీఆర్ దంపతులను ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు.
