సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రమేష్ ఎగ్గిడి – శ్రీకాంత్ మొగదాసు – చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న వినూత్న కథా చిత్రం మిరాకిల్. ఇందులో హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. సురేష్, శ్రీరామ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో రణధీర్ బీసు హీరో. సత్య గ్యాంగ్, ఫైటర్ శివ చిత్రాల దర్శకుడు ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ హైదరాబాద్ పరిసర గ్రామమైన కొండమడుగులో పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజలు, యూనిట్ సభ్యులందరి సమక్షంలో మేకర్స్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. హెబ్బా పటేల్ మాట్లాడుతూ కుమారి 21ఎఫ్, ఈడో రకం – ఆడో రకం, ఓదెల రైల్వే స్టేషన్ వంటి బ్లాక్‌బస్టర్స్ నా కెరీర్‌లో ఉన్నప్పటికీ తాజాగా నేను చేస్తున్న మిరాకిల్ నా కెరీర్‌లో మోస్ట్ మెమరబుల్ మూవీ అవుతుంది. థాంక్స్ టు డైరెక్టర్ ప్రభాస్ నిమ్మల అని హీరోయిన్ హెబ్బా పటేల్ చెప్పారు.

హీరో శ్రీరామ్ మాట్లాడుతూ ఇటువంటి మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పెద్ద హిట్ చేస్తారు. దర్శకుడిగా ప్రభాస్ నిమ్మలకు ఉజ్వల భవిష్యత్ ఉంది అని తెలిపారు. ప్రభాస్ నిమ్మల మాట్లాడుతూ ఈ చిత్రానికి పని చేస్తున్న ప్రతి ఒక్కరూ తమ సొంత సినిమాలా భావించి, అంకితభావం చూపుతుండటం నన్ను చాలా భావోద్వేగానికి లోనుచేస్తోంది. మరీ ముఖ్యంగా శ్రీరామ్, సురేష్, హెబ్బా పటేల్ సహాయ సహకారాలు ఎప్పటికీ మర్చిపోలేను. హీరో రణధీర్, విలన్ నరేష్ నాయుడులకు ఈ చిత్రంతో చాలా మంచి పేరు వస్తుంది. ఇప్పటివరకు మన ఇండియన్ స్క్రీన్ పై రాని సరికొత్త కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం చాలా బాగా రావడానికి ముఖ్య కారకులు మా కెమెరామెన్ సురేందర్ రెడ్డి. అలాగే కొండమడుగు గ్రామ ప్రజల ప్రేమాభిమానాలు మా యూనిట్ ఎప్పటికీ మర్చిపోదు అని అన్నారు. ఈ మూడో షెడ్యూల్‌తో దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తయ్యింది. చివరి షెడ్యూల్ త్వరలో ప్లాన్ చేస్తాం. మా దర్శకుడు ప్రభాస్ నిమ్మల ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం కచ్చితంగా ఉంటుంది అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ చెప్పారు.















