
ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మిత్ర మండలి. విజయేందర్ ఎస్ దర్శకుడు. బన్నీ వాసు సమర్పణలో రూపొందుతున్నది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.ఈ సినిమా ద్వారా సోషల్‌మీడియా ఫేమ్ నిహారిక ఎన్.ఎం. తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నది. స్నేహం ప్రధానంగా నడిచే కథ ఇదని, నలుగురు మిత్రులు చేసే హంగామా ఆద్యంతం నవ్వుల్ని పంచుతుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ్ ఎస్.జె, సంగీతం: ఆర్.ఆర్.ధృవన్, నిర్మాతలు: కల్యాణ్ మంతిన, భానుప్రతాప, డా॥ విజయేందర్ రెడ్డి, దర్శకత్వం: విజయేందర్ ఎస్.
