మోహన్ లాల్ నటిస్తున్న చిత్రం ఎల్ 360. తరుణ్ మూర్తి దర్శకత్వం. రెజపుత్ర విజువల్ మీడియా సమర్పణ లో వస్తోన్న ఈ చిత్రంలో పాపులర్ నటి శోభన ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. మోహన్‌లాల్ సినిమాలో మళ్లీ నటిస్తుండటం ఎక్జయిటింగ్‌గా ఉందంటోంది శోభన. మా ఇద్దరి కాంబోలో వస్తోన్న 56వ సినిమా ఇది. నేడు ఎల్ 360 షూటింగ్ షురూ అయింది. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ లొకేషన్‌కు వచ్చారు. షూటింగ్ లొకేషన్ లో మోహన్ లాల్, శోభన షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న స్టిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. లాంగ్ గ్యాప్ తర్వా త శోభన-మోహన్‌లాల్ కలిసి నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగి పోతు న్నాయి. ప్రార్థన తో తరుణ్ మూర్తి నేతృత్వంలో ఎమ్. రెంజిత్ నిర్మిస్తున్న నా 360వ ప్రాజెక్ట్ చిత్రీకరణను ప్రారంభిం చాం. నా 360వ సినిమాను ప్రారంభించినందుకు టీం మెంబర్స్‌కు నా ప్రగాఢ కృతజ్ఞతలు తెలియ జేస్తున్నా, మీ ఆశీస్సులు కోరుతున్నానని అని తెలిపారు.