Namaste NRI

అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ.. మూన్‌లైటింగ్

భారత సంతతి వ్యక్తి మెహుల్‌ గోస్వామి (39)ని న్యూయార్క్‌ అధికారులు ఈ నెల 15న అరెస్ట్‌ చేశారు. ఆయన న్యూయార్క్‌ స్టేట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఆఫీస్‌లో ప్రభుత్వోద్యోగం చేస్తూనే, గ్లోబల్‌ ఫౌండ్రీస్‌ అనే సెమీ కండక్టర్‌ కంపెనీలో కాంట్రాక్టర్‌గా కూడా పని చేసినందుకు కేసు నమోదు చేశారు. ఆయన 2022 మార్చి నుంచి ఈ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. ఈ విషయాన్ని వివరిస్తూ ఓ ఆకాశ రామన్న ఈ-మెయిల్‌ రావడంతో దర్యాప్తు ప్రారంభమైంది. ఆయనకు గరిష్ఠంగా 15 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం ద్వారా ఆయన 2024లో సుమారు రూ.1 కోటి సంపాదించారు. మూన్‌లైటింగ్‌ చేయడమే అతడి అరెస్టుకు కారణం. ఒక వ్యక్తి సాధారణ ఉద్యోగ సమయం తర్వాత కూడా మరో ఉద్యోగం చేయడాన్ని మూన్‌లైటింగ్‌ అంటారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events