Namaste NRI

మనీ నేపథ్యంలో మూవీ.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని , సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం కరెన్సీ నగర్. ఈ సినిమా ద్వారా వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్నిఉన్నతి ఆర్ట్స్ బ్యానర్ పై ముక్కాముల అప్పారావు , డా కోడూరు గోపాల కృష్ణ నిర్మిస్తున్నారు. ఆంతాలజీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 29న థియేటర్స్ లో విడుదల కాబోతోంది.డబ్బు చుట్టూ తిరిగే కథగా కరెన్సీ నగర్ సినిమా నేపథ్యం ఉంటుంది. డబ్బుకు మనిషికి ఉన్న సంబంధాన్ని దర్శకుడు వెన్నెల కుమార్ ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఈ పాయింట్ అన్ని వర్గాల ప్రేక్షకులను కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని మేకర్స్ తెలియజేశారు.

ఈ చిత్రాన్నికి సాంకేతిక నిపుణులు : బ్యానర్: ఉన్నతి ఆర్ట్స్.  నిర్మాతలు: ముక్కాముల అప్పారావు , డా కోడూరు గోపాల కృష్ణ.  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీధర్ గుడ్లూరు. దర్శకత్వం: వెన్నెల కుమార్ పోతేపల్లి.  సంగీతం: సిద్ధార్థ్ సదాశివుని, పవన్.  ఎడిటర్: కార్తిక్ కట్స్. సినిమాటోగ్రఫీ: సతీష్ రాజబోయిన. సౌండ్ ఎఫెక్ట్స్: యతిరాజు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events