Namaste NRI

మిస్టర్‌ రెడ్డి టీజర్‌ లాంచ్

టీఎన్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం మిస్టర్‌ రెడ్డి. వెంకట్‌ వోలాద్రి దర్శకుడు. టీఎన్‌ఆర్‌, మహాదేవ్‌, అనుపమ ప్రకాష్‌, దీప్తి, భాస్కర్‌ ప్రధాన పాత్రల్ని పోషించారు. టీజర్‌ను తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ విడుదల చేశారు. చిన్నతనంలో విడిపోయిన ప్రేమజంట, పెద్దయ్యాక మళ్లీ కలుసుకొని ప్రేమ కోసం ప్రయత్నిస్తే ఎలా ఉంటుందన్నదే ఈ సినిమా ఇతివృత్తమని దర్శకుడు తెలిపారు. కొత్తవాళ్లందరూ కలిసి చేసిన ఈ ప్రయత్నాన్ని అందరూ ప్రోత్సహించాలని హీరో టీఎన్‌ఆర్‌ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: కె.ఎన్‌.భూషణ్‌, సంగీతం: కేఎస్‌ఆర్‌ మ్యూజికల్‌, రచన-దర్శకత్వం: వెంకట్‌ రెడ్డి వోలాద్రి.

Social Share Spread Message

Latest News