కెంటరీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో లుయివిల్ నగరంలో సంగీత విభావరి కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటీ సారథ్యంలో ఆయన బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కోటీ స్వరపరిచిన ఎన్నో హిట్ సినీ గీతాలను గాయనీ గాయకులు ఆలపించారు. ప్రజాదరణ పొందిన ఈ పాటలకు ప్రేక్షకులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కెంటరీ తెలుగు సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ అడ్డాల మాట్లాడుతూ గత రెండేళ్లుగా ఎలాంటి కార్యక్రమాలూ నిర్వహించలేదని, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, కొవిడ్ నిబంధనలు సడలించడం వల్ల ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బోర్డు, కార్యనిర్వాహక బృందాన్ని సభకు పరిచయం చేశారు. తందూరి ప్యూజన్ వారు ప్రేక్షకులకు విందు భోజనం అందించారు. ఉపాధ్యక్షుడు ప్రసాద్ నడిరపల్ల వందన సమర్పణలో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు భారీగా తరలివచ్చారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)