Skip to main content

Namaste NRI

కెంటకీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో సంగీత విభావరి

కెంటరీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో అమెరికాలోని కెంటకీ రాష్ట్రంలో లుయివిల్‌ నగరంలో సంగీత విభావరి కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటీ సారథ్యంలో ఆయన బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కోటీ స్వరపరిచిన ఎన్నో హిట్‌ సినీ గీతాలను గాయనీ గాయకులు ఆలపించారు. ప్రజాదరణ పొందిన ఈ పాటలకు ప్రేక్షకులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కెంటరీ తెలుగు సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ అడ్డాల మాట్లాడుతూ  గత రెండేళ్లుగా ఎలాంటి కార్యక్రమాలూ నిర్వహించలేదని, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, కొవిడ్‌ నిబంధనలు సడలించడం వల్ల ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బోర్డు, కార్యనిర్వాహక బృందాన్ని సభకు పరిచయం చేశారు. తందూరి ప్యూజన్‌ వారు ప్రేక్షకులకు విందు భోజనం అందించారు. ఉపాధ్యక్షుడు ప్రసాద్‌ నడిరపల్ల వందన సమర్పణలో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు భారీగా తరలివచ్చారు.

Social Share Spread Message

Latest News