అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రధాన పాత్రలుగా రూపొందిన చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి. శివ పాలడుగు దర్శకుడు. హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మాతలు. ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన ఈ ఈవెంట్‌కి దర్శకుడు అజయ్ భూపతి అతిథిగా హాజరై యూనిట్ సభ్యులకు శుభాకాంక్ష లు అందించారు. టీజర్ విడుదల అనంతరం అజయ్ భూపతి మాట్లాడుతూ చాందినీ చౌదరికి నటన పట్ల ఉన్న డెడికేషన్ చూసి చాలా ఆశ్చర్యపోయాను.ఆమె నటించే తీరు చూసి నేనే పెద్ద గొప్ప నటుడ్ని అనుకునే గర్వం పోయిందని అన్నారు. ఇది సినిమాగా అనిపించే జీవితమని, కథే ఇందులో హీరో అని, తాము పాత్రలం మాత్రమేనని అన్నారు. మధ్యతరగతి కుటుంబాలకు కనెక్టయ్యే సినిమా ఇదని, భిన్న మనస్తత్వాలున్న ఇద్దరి ప్రయాణమే ఈ సినిమా కథ అని చాందినీ చౌదరి చెప్పారు. సహకరించిన నిర్మాతలకు దర్శకుడు శివ పాలడుగు కృతజ్ఞతలు తెలిపారు.
