Namaste NRI

డెవిల్ నుంచి మ్యూజికల్ అప్‌డేట్.. ఫ‌స్ట్ సింగిల్ కు ముహూర్తం ఫిక్స్‌

కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్‌ స్పై థ్రిల్లర్‌ డెవిల్‌. సంయుక్త మీనన్‌ కథానాయిక. స్వీయ దర్శకత్వంలో అభిషేక్‌ నామా తెరకెక్కిస్తున్నారు. నవీన్‌ మేడారం ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.  ఈ సినిమాలో ఓ రహస్యాన్ని ఛేదించే బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ పాత్రలో హీరో కల్యాణ్‌రామ్‌ కనిపించబోతున్నారు.  ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు సినిమాపై తిరుగులేని అంచనాలు క్రియేట్‌ చేశాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్‌ అప్‌డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్ మాయే చేసేయ్ అంటూ సాగే పాట‌ను వినాయ‌క చ‌వితి కానుక‌గా సెప్టెంబ‌ర్ 19న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. హర్షవర్దన్‌ రామేశ్వర్‌ స్వరపరచిన ఈ పాటను సిధ్‌శ్రీరామ్‌ ఆలపించారు. మనసుకు హత్తుకునే మెలోడీ గీతమిదని చిత్రబృందం పేర్కొంది.

ఇప్పటికే రిలీజైన టీజర్‌ జనాల్లో మంచి క్యూరియాసిటీ క్రియేట్‌ చేసింది. దేశ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా డెవిల్‌ ముసుగేసుకుని బ్రిటీషర్ల కోసం కళ్యాణ్‌రామ్ ఎందుకు పని చేశాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తుంది. లుక్స్‌ పరంగా కళ్యాణ్‌ రామ్‌ కూడా ఈ సినిమాలో చాలా బాగున్నాడు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events