Namaste NRI

కుటుంబంతో కలిసి ఈ సినిమా చూడాలి: వెంకట్‌ప్రభు

నాగచైతన్య కథానాయకుడిగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం  కస్టడీ.  కృతి శెట్టి కథానాయిక. శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.  ఈ  చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన థాంక్స్‌మీట్‌లో నాగచైతన్య మాట్లాడుతూ మా చిత్రానికి తొలి ఆట నుంచి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. అండర్‌వాటర్‌ సీన్స్‌, ట్రైన్‌ ఫైట్‌ వంటి సన్నివేశాలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ఈ సినిమా విషయంలో మా అంచనాలన్నీ నిజమయ్యాయి అన్నారు.  

దర్శకుడు మాట్లాడుతూ తెలుగులో నేను చేసిన మొదటి సినిమాకు ఈ స్థాయిలో ఆదరణ రావడం చాలా ఆనందంగా ఉంది. వందశాతం మా కష్టం ఫలించింది. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ బాగున్నాయని ప్రశంసలొస్తున్నాయి. ఎంతో రిస్క్‌ తీసుకొని నాగచైతన్య పోరాటఘట్టాల్లో నటించాడు. కుటుంబంతో కలిసి ఈ సినిమా చూడాలని ప్రేక్షకుల్ని కోరుతున్నా  అని చెప్పారు. ఈ సినిమాపై తాము పెట్టుకున్న నమ్మకం నిజమైందని, అన్ని కేంద్రాల్లో మంచి ఆదరణ లభిస్తున్నదని నిర్మాత శ్రీనివాస చిట్టూరి పేర్కొన్నారు. సినిమాలో తన అభినయానికి మంచి మార్కులు పడ్డాయని, గొప్ప కథలో భాగం కావడం ఆనందంగా ఉందని కథానాయిక కృతిశెట్టి చెప్పింది. ఆర్ట్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశాలు చాలా వున్నాయి. పోలీస్‌ స్టేషన్‌ ఫైట్‌ గానీ, అండర్‌ వాటర్‌ సీన్‌ గానీ ఖర్చుపెట్టి నిర్మాత తీయించారు. అవి చాలా అద్భుతంగా దర్శకుడు తీశారు. థియేటర్‌ లో వాటికి మంచి స్పందన వస్తోంది అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events