Namaste NRI

నా కల ఈ చిత్రంతో తీరింది : అశ్వత్

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న సినిమా ఓరి దేవుడా. మిథిలా పాల్కర్, ఆశా భట్ నాయికలుగా నటిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ కథతో దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో వెంకటేష్ దేవుడు పాత్రలో కనిపించనున్నారు. తాజాగా చిత్ర ట్రైలర్ను హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ నా కెరీర్ ఈ సినిమాకు ముందు తర్వాత అనేలా పేరు తెస్తుందని ఆశిస్తున్నా. వినోదం, భావోద్వేగాలు కలగలిపిన చిత్రమిది. నా ఫలక్నుమా దాస్ సినిమా ట్రైలర్ విడుదల చేసి దేవుడిలా ఆదుకున్న వెంకటేష్ గారు ఈ చిత్రంలో దేవుడు పాత్రలో నటించడం సంతోషంగా ఉంది. అలాంటి ఒక సోదరుడు ఉండాలని అనిపించింది. ఆశా భట్, మిథిలా పాల్కర్ నటన ఆకర్షణగా నిలుస్తుంది అన్నారు. నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి మాట్లాడుతూ మా సంస్థలో వైవిధ్యమైన సినిమాల్ని నిర్మించాం. తొలిసారి ఓ యూత్ఫుల్ సినిమా చేస్తున్నాం అన్నారు. తెలుగు సినిమా తెరకెక్కించాలనే నా కల ఈ చిత్రంతో తీరింది అని దర్శకుడు అశ్వత్ మారిముత్తు అన్నారు. దేవుడి పాత్రలో వెంకటేశ్గారు అద్భుతంగా నటించారు. బొమ్మరిల్లు, తొలి ప్రేమ సినిమాల అంతటి హిట్ విశ్వక్సేన్కు ఈ సినిమాతో వస్తుంది అన్నారు నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి. పీవీపీ సినిమా సంస్థ నిర్మిస్తున్నది. దీపావళి పండ్కకి ఈ నెల 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో వెంకటేష్ కాకుమాను, నృత్య దర్శకుడు జేడీ, ఎడిటర్ విజయ్, కళా దర్శకుడు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events