నాగార్జున నటిస్తున్నచిత్రం నా సామిరంగ. ఆషికా రంగనాథ్ కథానాయిక. విజయ్ బన్నీ దర్శకుడు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకు చెందిన పాటను మేకర్స్ విడుదల చేశారు. ఎం.ఎం.కీరవాణి స్వరపరచగా, చంద్రబోస్ రాసిన ఎత్తికెళ్లిపోవాలనిపిస్తుంది అంటూ సాగే ఈ గీతం యువతరం ప్రేక్షకులను గిలిగింతలు పెట్టేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ పాటతో నా సామిరంగ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ ఘనంగా ప్రారంభమయ్యాయని, ఆస్కార్ విజేతలైన కీరవాణి, చంద్రబోస్‌ల సంగీత సాహిత్యాలు ఈ సినిమాకు ప్రధానబలంగా నిలువనున్నాయని, ముఖ్యంగా ఈ పాటను రామ్ మిరియాల అద్భుతంగా ఆలపించాడని, నాగ్, కీరవాణి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ఆల్బమ్స్‌కి ఏమాత్రం తగ్గని స్థాయిలో ఈ ఆల్బమ్ కూడా ఉండనుందని నిర్మాత చెప్పారు. ప్రమోషన్స్‌లో రగ్గ్‌డ్‌గా కనిపిస్తున్న నాగార్జున, ఈ పాటలో చాలా హ్యాండ్సమ్‌గా అలరిస్తారని, ఇక ఆషికా ట్రెడిషనల్ లుక్‌తో ఆకట్టుకుంటుందని, ఈ పాట ఆడియన్స్‌కి విజువల్ ఫీస్టేనని దర్శకుడు చెప్పారు. ప్రసన్నకుమార్ బెజవాడ కథ, మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: పవన్‌కుమార్. నిర్మాణం: శ్రీనివాస్ సిల్వర్‌స్క్రీన్.