Namaste NRI

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మిస్టీరియస్

రోహిత్‌, మేఘన రాజ్‌పుత్‌ జంటగా నటిస్తున్న చిత్రం మిస్టీరియస్‌. మహి కోమటిరెడ్డి దర్శకుడు. జయ్‌ వల్లందాస్‌ నిర్మాత. ఇటీవలే సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మా సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేశారు.  సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ వినూత్న కథాంశంతో తెరకెక్కించిన చిత్రమిదని, ఓ రహస్యాన్ని ఛేదించే క్రమంలో ఎదురయ్యే సంఘటనలు ఉత్కంఠను పంచుతాయని అన్నారు. అభిద్‌ భూషణ్‌, రియా కపూర్‌, బాలరాజ్‌ వాడి, శ్రీనివాస్‌ భోగిరెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు, సంగీతం: ఎమ్‌ఎల్‌ రాజా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహి కోమటి రెడ్డి.

Social Share Spread Message

Latest News