నాగ చైతన్య చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై దీన్ని నిర్మిస్తున్నారు. బతుకుతెరువు కోసం గుజరాత్‌లోని వీరవల్‌కు వెళ్లి సముద్రవేట చేస్తూ పాకిస్థాన్ కోస్టుగార్డులకు చిక్కిన మత్స్యకారుల ఇతివృత్తం ఆధారంగా NC23 సినిమా రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఒక సాలిడ్ అప్‌డేట్ వచ్చింది.
నాగ చైతన్య జన్మదినాన్ని పురస్కరించుకొని ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ సినిమాకు తండేల్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇక ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో పడవలో ఉండి శత్రువులతో పోరు చేస్తూన్నట్లు యాక్షన్ మోడ్‌లో కనిపించారు నాగ చైతన్య. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. కాగా ఈ మూవీ కోసం నాగ చైతన్య బాడీ ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మూవీ కోసం చైతూ లుక్ మార్చి, గడ్డం, జుట్టు పెంచి అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు.