పాన్ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్విన్ దత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. దీపికా పదుకొనే, దిశా పటానీ కథానాయికలుగా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 27న ప్రేక్షకుల ముందు కు సినిమా రానుంది. విడుదలకు ఇంకా నెల రోజులే ఉండడంతో వరుస ప్రమోషన్స్ పాల్గోంటుంది కల్కి టీమ్. ఇప్పటికే భైరవ (ప్రభాస్) బుజ్జి ఈవెంట్‌ను రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించగా ఈ ఈవెంట్ సూపర్ హిట్ అయ్యింది. అయితే ప్రభాస్ బుజ్జి కారు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ కారుని చూడడానికి ఇప్పటికే పలు మీడియా సంస్థలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి.
ఇదిలావుంటే తాజాగా ప్రభాస్ బుజ్జి కారుని టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య నడిపాడు. బుజ్జిని నడిపించ డం కోసం కల్కి మేకర్స్ కొత్తగా ఫార్మూలా 1 రేస్ లాకి వాడే సర్క్యూట్‌ను సృష్టించినట్లు తెలుస్తుంది. ఇక ఈ సర్క్యూట్‌లో నాగ చైతన్య బుజ్జి మీదా రైడ్ చేయగా, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.