అగ్ర హీరోలు నాగార్జున, ధనుష్‌లతో దర్శకుడు శేఖర్ కమ్ముల భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా కొద్ది రోజుల క్రితమే లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్ నేటి నుంచి గోవా లో ప్రారంభంకానున్నట్లు తెలిసింది. ఇందులో నాగార్జున, ధనుష్ పాల్గొంటారని,కొన్ని ముఖ్యఘట్టాలను తెరకెక్కిస్తారని చెబుతున్నారు. తనదైన శైలి సెన్సిబుల్ ఎమోషన్స్‌తో పాటు అంతర్లీనంగా చక్కటి సందేశాన్ని కలబోసి దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని చెబుతున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా, దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు.
