Namaste NRI

నాగార్జున కుబేర బ్యాంకాక్‌లో.. కొత్త షెడ్యూల్‌ ప్రారంభం

ధనుష్‌, నాగార్జున కథానాయకులుగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం కుబేర. రష్మిక మందన్న కథానాయిక.   ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌, అమిగోస్‌ క్రియేషన్స్‌ పతాకాలపై సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్నారు. తనదైన శైలిలో సామాజిక అంశాలను స్పృశిస్తూ దర్శకు డు శేఖర్‌ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా విడుదలైన ధనుష్‌ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ బ్యాంకాక్‌లో మొదలైంది. ఇందులో నాగార్జునతో పాటు చిత్ర ప్రధాన తారాగణం పాల్గొంటున్నారు. టాకీతో పాటు యాక్షన్‌ పార్ట్‌ను తెరకెక్కించబోతున్నామని, బ్యాంకాక్‌లో ఇప్పటి వరకు ఎవరూ చూడని సరికొత్త లొకేషన్స్‌లో షూటింగ్‌ జరుపుతున్నామని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నికేత్‌ బొమ్మి, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: రామకృష్ణ సబ్బాని, మోనికా నిగోత్రే, దర్శకత్వం: శేఖర్‌ కమ్ముల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events