Namaste NRI

నందమూరి బాలకృష్డాకు మహారాజ్ … ట్రైలర్‌ వచ్చేసింది

నందమూరి బాలకృష్ణ  హీరోగా నటిస్తున్న చిత్రం డాకు మహారాజ్‌. కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను అమెరికా డల్లాస్‌లో విడుదల చేశారు. 2 నిమిషాల 44 సెకన్లున్న ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేసిందని మేకర్స్‌ ఆనందం వెలిబుచ్చారు. అనగ నగా ఒక రాజు ఉండేవాడు,  చెడ్డవాళ్లంతా ఆయనను డాకు అనేవాళ్లు. మాకు మాత్రం మహారాజ్‌  అనే చిన్న పాప వాయిస్‌తో ట్రైలర్‌ మొదలైంది. తొలుత డాకు మహారాజ్‌ గా, తర్వాత చిన్నారిని రక్షించే నానాజీగా రెండు కోణాల్లో మాస్‌ మెచ్చేలా బాలయ్య ఈ ట్రైలర్‌లో కనిపిస్తున్నారు. హాస్యం, ఉద్వేగం, యాక్షన్‌ మేళవింపుగా ట్రైలర్‌ సాగింది. బాబీ డియోల్‌ విలన్‌గా, శ్రద్ధా శ్రీనాథ్‌, ఊర్వశి రౌతేలా, మకరంద్‌ పాండే కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. హాలీవుడ్‌ని తలపించేలా విజువల్స్‌ ఉంటాయని, తమన్‌ మ్యూజిక్‌ హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: విజయ్‌ కార్తీక్‌, సమర్పణ: శ్రీకర స్టూడియోస్‌, నిర్మాణం: సితార ఎంటైర్టెన్మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్‌ సినిమాస్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events