నందితాశ్వేత, వెన్నెల కిషోర్, షకలక శంకర్, నవమి గాయన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఓ మంచి ఘోస్ట్. శంకర్ మార్తాండ్ దర్శకత్వం. ఇటీవల థీమ్ వీడియోను విడుదల చేశారు. హారర్, కామెడీ అంశాల కలబోతగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఓ హాంటెడ్ హౌస్‌లో జరిగే కథ ఇది. ఆద్యంతం నవ్విస్తూ భయపెడు తుంది. హారర్ కామెడీ జోనర్‌లో ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది. దెయ్యం పాత్రలో నందితాశ్వేత అభినయం మరో స్థాయిలో ఉంటుంది అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ఐ.ఆండ్రూ, సంగీతం: అనూప్‌రూబెన్స్, నిర్మాత: డా॥ అబినికా ఇనాబతుని, దర్శకుడు: శంకర్ మార్తాండ్.