Namaste NRI

డీఈఐ చీఫ్‌ నీలా రాజేంద్రకు నాసా ఉద్వాసన 

నాసాలో ప‌నిచేస్తున్న భార‌తీయ సంత‌తి ఉద్యోగి నీలా రాజేంద్ర ను తొల‌గించారు. నాసాకు చెందిన డైవ‌ర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజ‌న్‌(డీఈఐ) చీఫ్‌గా ఆమె వ్య‌వ‌హ‌రించారు. ఇటీవ‌ల ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాల వ‌ల్ల ఆమె ఆ జాబ్ కోల్పోవాల్సి వ‌చ్చింది. దేశ‌వ్యాప్తంగా ఉన్న ఇలాంటి ప్రోగ్రామ్‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని ట్రంప్ ఆ ఆదేశాల్లో కోరారు. వాస్త‌వానికి నీలా రాజేంద్ర‌ను తొల‌గించ‌డానికి ముందు ఆమెకు మ‌రో హోదాను ఇచ్చారు. టీమ్ ఎక్సలెన్స్ అండ్ ఎంప్లాయి స‌క్సెస్ శాఖ‌కు హెడ్‌ను చేశారు. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు ఇచ్చిన త‌ర్వాత ఆ ప‌ద‌వి క‌ల్పించారు. కానీ ఆమెను ఉద్యోగం నుంచి తొల‌గించ‌కుండా చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు.

నాసాకు చెందిన జెట్ ప్రొప‌ల్ష‌న్ ల్యాబ‌రేట‌రీ గ‌త వారం ఓ ఈమెయిల్ షేర్ చేసింది. నాసాలో ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌కు నీలా రాజేంద్ర‌ను తొల‌గించిన విష‌యం చెప్పిన‌ట్లు ఆ మెయిల్‌లో వెల్ల‌డించారు. జెట్ ప్రొప‌ల్ష‌న్ ల్యాబ్‌లో నీలా రాజేంద్ర ప‌నిచేయ‌డం లేద‌ని, మ‌న సంస్థ‌కు చేసిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని, ఆమెకు బెస్ట్ విషెస్ చెబుతున్నామ‌ని ఆ మెయిల్‌లో రాశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events