Namaste NRI

జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల ప్ర‌క‌ట‌న‌.. తెలుగు సినిమాకు అవార్డుల పంట

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ (DFF) ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ అవార్డులు, భారతీయ సినిమా రంగంలో విశేష కృషిచేసిన చిత్రాలకు, కళాకారులకు రాష్ట్రపతి చేతుల మీదుగా అందించనున్నారు.2023 సంవత్సరానికి గాను 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల వివరాలను కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ఎల్‌ మురుగన్‌కు జ్యూరీకి అంద‌జేశారు. 2023 సంవత్సరంలో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, బాలల చిత్రం వంటి అనేక విభాగాల్లో అవార్డులు ఖరారయ్యాయి.

జాతీయ ఉత్త‌మ చ‌ల‌న చిత్రంగా 12th ఫెయిల్ అనే చిత్రానికి అవార్డ్ దక్కింది. జాతీయ ఉత్త‌మ న‌టుడి అవార్డ్ ఈ సారి ఇద్ద‌రు న‌టుల‌కి ద‌క్కింది. షారూఖ్ ఖాన్ ( జ‌వాన్), విక్రాంత్ మ‌స్సే( 12th ఫెయిల్) ఎంపిక‌య్యారు. ఉత్త‌మ న‌టిగా మిస్సెస్ ఛ‌ట‌ర్జీ వర్సెస్ నార్వే ( హిందీ)లో రాణీ ముఖ‌ర్జీకి అవార్డ్ వ‌రించింది. ఉత్తమ దర్శకత్వం లో ది కేరళ స్టోరీ (హిందీ) సుదీప్తో సేన్ ని అనౌన్స్ చేశారు.

71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ భగవంత్‌ కేసరి కి అవార్డు దక్క‌గా, హనుమాన్ మూవీకి బెస్ట్ స్టంట్ కోరియోగ్రఫీ నేషనల్ అవార్డు ద‌క్కింది. చిత్రానికి బెస్ట్ యాక్షన్ డైరెక్టర్స్ గా నందు, పృథ్వీ ప‌ని చేశారు. బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు సాంగ్‌కు నేషనల్ అవార్డు ద‌క్కింది. ఈ గీత రచయిత కాసర్ల శ్యామ్ అవార్డ్ అందుకోనున్నారు. ఉత్తమ్ స్క్రీన్ ప్లే – బేబీ (సాయి రాజేష్ నీలం (షేరింగ్),  బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్- బేబీ (పివి ఎన్ఎస్ రోహిత్), బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సుకృతి వేణి (సుకుమార్ కుమార్తె) – గాంధీ తాత చెట్టు, ఉత్తమ చిత్రం యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్ గేమింగ్ కామిక్ – హనుమాన్ లని జ్యూరీ సభ్యులు అనౌన్స్ చేసారు.

Social Share Spread Message

Latest News