వెంకటేశ్ హీరోగా నటిస్తోన్న చిత్రం సైంధవ్. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోండగా, సైంధవ్ మిషన్‌లో కీ రోల్ పోషించే వ్యక్తిగా రుహానీ శర్మ కనిపించబోతుంది. సైంధవ్ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి తెరకెక్కిస్తున్నారు. సైంధవ్‌కు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్ర పోషిస్తుండగా, తాజాగా ఆయన లుక్ లాంఛ్ చేశారు. సైంధవ్‌లో వికాస్ మాలిక్ పాత్రలో నటిస్తున్నాడు నవాజుద్దీన్ సిద్దిఖీ. తాజా లుక్‌లో నవాజుద్దీన్ సిద్దిఖీ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ నవాజుద్దీన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, లాంచ్ చేసిన లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా నేపథ్యంలో సాగే స్టోరీతో తెరకెక్కుతున్న సైంధవ్ పాన్ ఇండియా స్థాయిలో 2023 డిసెంబర్ 22న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.