Namaste NRI

మెగా 157 షూట్‎లో నయనతార జాయిన్.. ముస్సోరీలో కీలక సన్నివేశాలు

అనిల్‌రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మెగా157 వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయిక. ఈ సినిమా కోసం ఇటీవల నయనతార ఓ ప్రమోషనల్‌ వీడియోను విడుదల చేయగా, దానికి అద్భుతమైన స్పందన లభించింది.మున్ముందు సినిమా ప్రచార కార్యక్రమాల్లో నయనతార అదరగొట్టబోతున్నదని మేకర్స్‌ చెబుతున్నారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ముస్సోరిలో జరుగుతున్నది. ఈ షూట్‌లో నయనతార జాయిన్‌ అయ్యారు. కామెడీ ప్రధానంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన వీడియోలో చిరంజీవి వింటేజ్‌ అవతార్‌లో కనిపించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల, రచన-దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.

Social Share Spread Message

Latest News