
నయనతార నటిస్తోన్న తాజా చిత్రం రక్కయీ. సెంథిల్ నల్లసామి దర్శకత్వం. నయనతారకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఈ మూవీ టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు. నయనతార ఏడుస్తున్న పిల్లవాడికి పాలు తాగించి, మరోవైపు వీరనారిగా రెండు చేతుల్లో ఆయుధాలు పట్టి సమరంలో పాల్గొంటున్న విజువల్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని డ్రమ్ స్టిక్స్ ప్రొడక్షన్స్, మూవీ వెర్సె ఇండియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే షూటింగ్, ఇతర వివరాలపై క్లారిటీ రానుంది.
