మాల్దీవులు అధ్యక్షుడు మయిజ్జు మొండి వైఖరి వీడాలని, భారత్‌తో చర్చలు జరపాలని ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం సోలే సూచించారు. చైనా అనుకూలుడుగా ముద్రపడిన ప్రస్తుత అధ్యక్షుడు మయిజ్జు భారత్ పట్ల తీవ్ర వ్యతిరేక వైఖరిని ఎంచుకోవటాన్ని మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం సోలే తప్పుబడుతున్నారు. ఏప్రిల్ 21న మాల్దీవులు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌తో మాల్దీవులు సంబం ధాలు దెబ్బతినటం అక్కడ చర్చనీయాంశమైంది. తాజాగా మాఫాన్నులో ఎన్నికల ర్యాలీలో ఇబ్రహీం సోలే మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రుణ పునర్‌వ్యవస్థీకరణపై భారత్ సాయం కోరటం తప్పు లేదు. మొండితనంతో వెళ్లకుండా భారత్‌తో చర్చలు జరపాలని ఆయనకు సూచిస్తున్నా అని సోలే అన్నారు.