అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. వెన్నెల కిషోర్ టైటిల్ రోల్‌ని పోషించిన ఈ సినిమాకు రైటర్ మోహన్ దర్శకుడు. ఈ నెల 25న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనన్య నాగళ్ల మాట్లాడుతూ కెరీర్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నా. పొట్టేల్ సినిమాలో నా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం కొత్తదనంతో కూడిన కథల్ని ఎంచుకుంటున్నా అని చెప్పింది. ఇప్పటి వరకు నేను ఇలాంటి కథ వినలేదు. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇందులో నేను భ్రమరాంబ అనే పాత్రలో కనిపిస్తా. తన పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుంది. ఆమె చుట్టూ నడిపించిన ప్రేమకథ కూడా ఆసక్తికరంగా అనిపిస్తుంది అని తెలిపింది. వకీల్ సాబ్ సినిమా షూటింగ్ టైంలో పవన్‌కల్యాణ్ తన నటన చూసి మెచ్చుకున్నా రని, ఎమోషన్స్‌ను బాగా పండించడంతో పాటు రియల్ పెయిన్ కనిపిస్తున్నదని చెప్పడం ఎంతో ఆనందాన్ని చ్చిందని పేర్కొంది. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలో ఓ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నానని, కథాకళి, లేచింది మహిళా లోకం సినిమాలు త్వరలో రాబోతున్నాయని అనన్య నాగళ్ల చెప్పింది.